ఏపీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే.. జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని.. మహిళ్లలా సింగారించుకుంటారు. రతీ మన్మథుడికి పూజలు చేస్తారు.
చీరలు కట్టుకుని, నగలు, పూలతో సింగారించుకొంటారు. హోలీ సందర్భంగా తమ గ్రామంలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారు. ఇక్కడికి కర్ణాటక రాష్ట్రం నుంచీ చాలామంది వస్తారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం.
ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఏటా.. హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు.
ఇవీచూడండి: కొత్త వసంతానికి స్వాగతం పలికే హోలీ.. కరోనా దృష్ట్యా సాదాసీదాగానే!