రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం.. పోలీసులకు పతకాల(Medals)ను ప్రకటించింది. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఈ పతకాలు పొందారు.
ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం, శౌర్య పతకం, మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, సేవా పతకాలకు పలువురిని ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ పోలీసు సేవా పతకమైన ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకానికి గజ్వేల్ ఏసీపీ నారాయణ, హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ రాంరెడ్డి ఎంపికయ్యారు.
శాంతిభద్రతలు, ఏసీబీ, సీఐడీ, అగ్నిమాపక, స్పెషల్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసుల్లో అర్హులైన వాళ్లను పలు పతకాలకు ఎంపిక చేశారు. అన్ని పతకాలకు కలిపి దాదాపు 661 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు.
- ఇదీ చదవండి : అధునాతన లైట్లతో కాంతులీనుతోన్న యాదాద్రి ఆలయం