ETV Bharat / city

Hyderabad Metro Parking: మెట్రో పార్కింగ్​ వద్ద అడ్డగోలు వసూళ్లు.. రూ.25 చెల్లించాల్సిందే

హైదరాబాద్ మెట్రో రైలు పార్కింగ్​లో వాహనదారుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా వాహనం పార్కింగ్ చేసిన వెంటనే 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే పార్కింగ్​ నిర్వాహకులు వాగ్వాదానికి దిగుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు 3 గంటలలోపు అయితే రూ.15 వసూల్ చేయాలనే నిబంధనలు ఉన్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. మెట్రో రైలులో ప్రయాణించడం కన్నా.. పార్కింగ్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

hyderabad metro parking
hyderabad metro parking
author img

By

Published : Nov 5, 2021, 5:12 AM IST

హైదరాబాద్​ మెట్రో రైలు స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఫీజులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సౌకర్యాల పేరుతో సరికొత్త దందాకు తెరతీశారు. ద్విచక్ర వాహనం నిలిపితే పార్కింగ్‌ ఫీజు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌ ఏరియాలో వాహనం ఆపగానే పాతిక రూపాయలు కట్టించుకుంటున్నారు. గంటలో వస్తానన్నా కూడా ఇంతే ఛార్జీ అని దబాయించి మరీ వసూలు చేశారు. రోజు మొత్తం నిలిపితే ఎంత వసూలు చేస్తారో.. గంట, రెండు గంటలకూ అంతే వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. కొంతకాలంగా పార్కింగ్‌ దోపిడిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా.. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దబాయించి మరీ వసూళ్లు..

ద్విచక్ర వాహనాలకు 3 గంటల లోపు అయితే 15 రూపాయలు, 3 గంటల నుంచి రోజంతా అయితే పాతిక రూపాయలు చెల్లించాలని అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. కానీ 15 రూపాయలు ఎక్కడా తీసుకోవడం లేదు. దబాయించి మరీ పాతిక రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్‌ కావడంతో ఐదు నిమిషాలు ఆపినా.. రెండు గంటలు ఆపినా తమకు సంబంధం లేదని ఏకంగా రూ.25 ముందే తీసుకుంటున్నారు. మెట్రో రైలులో ప్రయాణించాలంటే కనీస ఛార్జీ రూ.10 ఉండగా.. పార్కింగ్‌ ఛార్జీ 25 రూపాయలు తీసుకోవడంపై ప్రయాణికులు, ఆపరేటర్లకు నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి.

నిలువు దోపిడి..

మెట్రో స్టేషన్ల వద్ద సరైన పార్కింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో రహదారులపై.. బైక్​లు, కార్ల పార్కింగ్‌కు హైదరాబాద్​ మెట్రో రైలు అభ్యర్థన మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలుత 24 స్టేషన్ల వద్ద పార్కింగ్‌ ఫీజూ వసూలుకు అనుమతి ఇచ్చింది. వాహనదారుల నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేసి తాము పార్కింగ్‌ నిర్వహిస్తామని పార్క్‌ హైదరాబాద్‌ సంస్థ ముందుకొచ్చింది. రెండు గంటలకు ద్విచక్ర వాహనం పార్కింగ్​కు కనీస ఛార్జీ రూ.5, అదే కారుకు రూ.10 ఛార్జీలు నిర్ణయించారు. దీనికి జీఎస్‌టీ అదనం. కానీ ఏ రోజు ఈ ధరలను అమలు చేయలేదు. ప్రారంభం నుంచే ద్విచక్ర వాహనాలకు కనీస ఛార్జీ రూ.10 వసూలు చేశారు. కొవిడ్‌ తర్వాత పార్కింగ్‌ కేంద్రాల్లోని బోర్డులపై పెంచిన రేట్లు దర్శనమిస్తున్నాయి. ఈ బోర్డులు కూడా అన్నిచోట్ల ఏర్పాటు చేయలేదు. తెలియక పార్క్‌ చేస్తే నిలుపు దోపిడీకి గురవుతున్నారు. వీటిని తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీచూడండి: దేశంలో ఘనంగా దీపావళి- నరకాసుర వధతో సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.