ETV Bharat / city

'బుల్లెట్ సైలెన్సర్ మార్చారో.. మీ బైక్ స్టేషన్​కే' - సికింద్రాబాద్​లో మహంకాళి పోలీసులు స్పెషల్ డ్రైవ్

మీరు బుల్లెట్‌ బైకు కొన్నారా..? కొంటే బైక్​తో వచ్చింది తొలగించి దడ పుట్టించే సైలెన్సర్‌ బిగిస్తున్నారా... అయితే ఇక మీ ఆటలు సాగవ్​. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ముందు మహంకాళి ట్రాఫిక్​ పోలీసులు ఇవాళ ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించి... అలాంటి వారిపై కేసులు నమోదు చేసి బైక్​లు స్టేషన్​కు తరలించారు.

manhakali police special drive on awareness on traffic rules in secundrabad
'బుల్లెట్ సైలెన్సర్ మార్చారో.. మీ బైక్ స్టేషన్​కే'
author img

By

Published : Jan 28, 2021, 5:30 PM IST

బుల్లెట్​ బైక్​ ఉంటే... కచ్చితంగా దానికి దడ్​.. దడ్​.. దడ్​ మంటూ శబ్ధం వచ్చే సైలెన్సర్​ను బిగిస్తుంటారు. అయితే అలాంటి శబ్ధంతో రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదాచారులు భయాందోళనలకు గురవుతున్నారంట. ఇందుకోసం ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ముందు మహాంకాళి ట్రాఫిక్​ సీఐ శంకర్ యాదవ్, ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలాంటి శబ్ధం చేసుకుంటూ వెళ్తున్న బుల్లెట్​లను ఆపి కేసులు నమోదు చేస్తున్నారు.

సైలెన్సర్లు మార్చి డ్రైవ్ చేస్తున్న వాహనదారుల పొటోలు తీసి ఛలాన్​లు పంపిస్తున్నారు. అలాంటి ఇబ్బందికరమైన సైలెన్సర్లు తొలగించాలని అవగాహన కల్పిస్తున్నట్టు సీఐ శంకర్​ యాదవ్​ తెలిపారు. జరిమానా చెల్లించి, సైనెన్సర్​ తొలగిస్తేనే... బైకులు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎస్సై శంకర్​ అన్నారు.

ఇదీ చూడండి: 125 గోవులను రక్షించిన యుగ తులసి ఫౌండేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.