తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో ఓ మామిడి చెట్టు చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోంది. చెట్టుకు ఆకులు లేకుండా కొమ్మల నుంచి కాయలు కాశాయి. గ్రామంలోని వర్థినేని రామచంద్రరావు ఇంటి పెరట్లో ఉన్న ఈ మామిడి చెట్టుకు గతంలో రెండు కొమ్మలు విరిగిపోయాయి. ఈ ప్రాంతంలోనే కొత్త కొమ్మలకు బదులు కాయలు కాశాయి. ఇలా కాసిన మామిడి గుత్తులను చూస్తే నోరూరడం మాత్రం ఖాయం.
ఇదీ చదవండి: తల్లి గర్భంలోనే కరోనాను జయించిన చిన్నారి!