ETV Bharat / city

ఈ కోడిగుడ్డు మీ కళ్లను మోసం చేయటం ఖాయం.! - వింత కోడి గుడ్డు

Mango Shaped Egg: కోడిగుడ్జు ఏ ఆకారంలో ఉంటుందని ఎవరినైనా అడిగితే వాళ్లు ఒకసారి మనల్ని ఎగాదిగా చూస్తారు. ఇదేం ప్రశ్న అని.. కానీ అలాంటి వాళ్లకు ఈ కోడిగుడ్డును తీసుకొచ్చి చూపిస్తే.. నోరు తెరిచి ముక్కున వేలేసుకోవడం ఖాయం. రంగు కూడా వేరేలా ఉంటే.. పండు అనుకొని గబుక్కున నోట్లో వేసుకున్నా ఆశ్చర్యం లేదు.

Mango Shaped Egg
మామిడి కాయ ఆకారంలో కోడిగుడ్డు
author img

By

Published : May 18, 2022, 7:18 PM IST

Updated : May 18, 2022, 7:33 PM IST

Mango Shaped Egg: వినాయకుడి ఆకారంలో ఉన్న బొప్పాయిని చూసుంటారు.. చిట్టి పిట్టల్లా కనిపించే ఆకులను చూసే ఉంటారు.. రామచిలుక ముక్కులా ఉండే పుష్పాలనూ చూసుంటారు.. మరి మామిడి కాయ ఆకారం కలిగిన కోడి గుడ్డును ఎప్పుడైనా చూశారా..? ఏపీలోని పల్నాడు జిల్లా దుర్గిలో మామిడికాయ ఆకారంలో ఉన్న ఈ కోడిగుడ్డు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Mango Shaped Egg
మామిడి కాయ ఆకారంలో కోడిగుడ్డు

శ్రీనివాసరావు అనే కిరాణా వ్యాపారికి చెందిన దుకాణానికి తెప్పించిన కోడిగుడ్లలో.. ఒకటి మామిడికాయ ఆకారంలో ఉండటం గమనించాడు. గుడ్డు సైజులో హెచ్చుతగ్గులుంటాయి కానీ.. పూర్తిగా ఆకారం మారిపోయి ఉండటం వింతగా ఉందని షాపు యజమాని అన్నారు. దుకాణానికి వచ్చేవారు మామిడికాయ ఆకారంలోని గుడ్డుని ఆసక్తిగా తిలకిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చూడండి : వృక్షమాత పద్మశ్రీ తిమ్మక్కను సన్మానించిన సీఎం కేసీఆర్

'ఎంత ఖర్చయిన భరిస్తాం... తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం'

ఆది పెళ్లిలో నాని​ హంగామా.. సాంగ్​తో 'మేజర్​', 'గాడ్సే' రిలీజ్​ డేట్​

Last Updated : May 18, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.