ETV Bharat / city

భారీ తరలింపుతో తగ్గిన మామిడి ధర

author img

By

Published : May 8, 2020, 2:57 PM IST

హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్‌కు మామిడి కాయ భారీగా వచ్చింది. ఎక్కువ మొత్తంలో వచ్చినందున ధర కొంచెం తగ్గినట్లు మార్కెట్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

mango price reduced slightly in gaddiannaram market hyderabad
భారీ తరలింపుతో తగ్గిన మామిడి ధర

హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్‌కు మామిడి కాయ భారీగా వచ్చింది. ఇటీవల కురిసిన రాళ్లవాన కారణంగా రైతులు మామిడిని ఎక్కువగా మార్కెట్‌కు తరలించారు.

గురువారం మొత్తంగా 900 క్వింటాళ్ల మామిడి కాయ మార్కెట్‌కు రాగ నేడు(శుక్రవారం) 17వేల క్వింటాళ్లకు పైగానే తీసుకొచ్చారు. తద్వారా ధర కొంచెం తగ్గినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. సాధారణంగా నాణ్యమైన మామిడి కాయ క్వింటా ధర రూ. 50 వేలు పలుకగా నేడు రూ.40 వేలు పలుకుతోందని తెలిపారు.

ఇదీ చూడండి: శోకసంద్రమైన భారతావని-ఒక్కరోజే మూడు ప్రమాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.