ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామ పరిధిలోని సముద్రతీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. అలల తాకిడికి తీరం సమీపంలోకి రావడంతో మందిరాన్ని స్థానికులు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. అది డ్రమ్ములతో చేసిన నాటు పడవపై ఉంది. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ మందిరం మన దేశానికి చెందిందా..? లేక వేరే దేశానికి చెందినదా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మందిరాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడకి చేరుకున్నారు.
ఇదీ చదవండి: 98 ఏళ్ల వయసులోనూ వ్యవసాయం చేస్తున్న బామ్మ