ETV Bharat / city

వాగులో గల్లంతయ్యాడు.. క్షేమంగా ఇంటికి చేరాడు - nivar effect on prakasham district

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన రాజేశ్​ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయి ఒడ్డుకు చేరాడు. సుమారు 10 కిలోమీటర్లు దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు.

వాగులో గల్లంతయ్యాడు.. క్షేమంగా ఇంటికి చేరాడు

author img

By

Published : Nov 27, 2020, 9:01 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయిన అతను ఒడ్డుకు చేరి 10 కిలోమీటర్లు నడిచి చదలవాడ వరకు చేరుకున్నాడు. అనంతరం చదలవాడ నుంచి ఒంగోలులోని తన నివాసానికి చేరుకున్నాడు.

మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగు ప్రవాహంలో ఓ కారు గురువారం రాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాజేశ్​‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆ యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.