రాష్ట్ర ప్రణాళిక సంఘం తెలంగాణ రాష్ట్ర గణాంకాల పుస్తకాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో 1 శాతం పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం, 15.50 శాతం పిల్లల్లో మధ్యస్థ పోషకాహార లోపం ఉన్నట్లు వెల్లడించింది. పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కుమురం భీం జిల్లాలో 2.89 శాతం పిల్లల్లో తీవ్ర పోషకాహారం లోపం ఉన్నట్లు తెలిపింది. తరువాత స్థానంలో ఉన్న మహబూబ్నగర్లో 2.14 శాతం.. అతి తక్కువగా ఖమ్మం జిల్లాల్లో 0.29 శాతం, నల్గొండలో 0.30 శాతం పిల్లల్లో మాత్రమే తీవ్ర పోషకాహార లోపం ఉంది.
పిల్లల్లో మధ్యస్థ పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న జాబితాలో కూడా కుమురం భీం జిల్లా 24.80 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 24.70 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా రెండో స్థానంలో ఉంది. మధ్యస్థ పోషకాహార లోపం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తక్కువ శాతం మంది పిల్లల్లో ఉంది. ఈ జిలాల్లో 7.55 శాతం, 8.45 శాతం మంది పిల్లల్లో మధ్యస్థ పోషకాహార లోపం ఉంది. రాష్ట్రం మొత్తంలో 83.49 శాతం పిల్లల్లో ఎలాంటి పోషకాహారం లేదు. రాష్ట్రం మొత్తం మీద 18 లక్షల 79వేల 954 మంది పిల్లలున్నారు.