ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 8న ఛలో దిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని... ప్రతి మాల కుటుంబం నుంచి ఒకరు వచ్చేలా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఛలో దిల్లీని విజయవంతం చేసేందుకు హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్లో రాష్ట్ర కార్యవర్గ సన్నాహాక సమావేశం నిర్వహించారు. హస్తినలో ఆందోళన కార్యక్రమాలతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ పని తప్పన్నందుకు... కన్న కూతురినే చంపేసింది