ETV Bharat / city

బ్యాంకులో ప్రేమజంట ఆత్మహత్య..! - lovers make suicide in bank at guntur

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బ్రాడీపేటలోని ప్రైవేటు బ్యాంకులో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 2 రోజుల తర్వాత ఈ విషాదం వెలుగులోకి వచ్చింది.

LOVERS SUCIDE IN BANK
బ్యాంకులో ప్రేమజంట ఆత్మహత్య.. 2 రోజుల తర్వాత వెలుగులోకి!
author img

By

Published : Apr 18, 2020, 5:33 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా బ్రాడీపేటలో.. ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్​గా, యువకుడు ప్రైవేటు బ్యాంకులో పని చేస్తుండా వారని గుర్తించారు. యువతి 2 రోజుల నుంచి ఇంటికి రాకపోవడంపై ఆందోళనతో.. వారి తల్లిదండ్రులు గుంటూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి మొబైల్‌ ఆధారంగా బ్రాడిపేటలో ఉన్నట్టు టవర్‌ లొకేషన్‌ చూపించడంతో... ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రైవేటు బ్యాంకులో పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవటంతోనే ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.