జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేశ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. భాగ్యనగరంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని లోకేశ్‌కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ముందుకెళ్తానన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్కుమార్ను పలువురు అధికారులు అభినందించారు.
రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేస్తున్న లోకేశ్కుమార్ను ప్రభుత్వం సోమవారం జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీగా ఉన్న దానకిశోర్‌ను జలమండలికి పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇవీ చూడండి: "ఉపరాష్ట్రపతినైనా... జనం మధ్యే ఉండాలనేదే నా ఆలోచన"