తెలంగాణలో లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు నగర వాసులు ఉదయం 9 గంటల నుంచే మాల్స్ బాట పట్టారు. సర్కారు ఆదేశానుసారం నగరంలోని రిటైల్ మార్కెట్ నిర్వాహకులు కస్టమర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినియోగదారులకు శరీర ఉష్ణోగ్రత పరీక్షించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పడం కనిపించింది. ఒకసారి అయిదుగుర్ని మాత్రమే లోపలికి పంపుతున్నారు.
షాపింగ్ మాల్స్ ఎదుట వరుసలో నిల్చున్న కొనుగోలుదారులు... ఒకరి మధ్య ఒకరికి సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...