ETV Bharat / city

గోడ పడిపోకుండా కర్రల సపోర్ట్... స్థానికుల ఆశ్చర్యం​

ఓ రెండంతస్తుల భవనం పక్కనే ఉన్న స్థలంలో నిర్మాణం కోసం పెద్ద గుంత తవ్వారు. ప్రహారీ గోడ కంటే లోతుగా తవ్వగా... పడిపోకుండా ఉండేందుకు విచిత్రంగా కట్టెలు సపోర్ట్​గా ఉంచారు. కనీసం ఆ కట్టెలకైనా బలమైన ఆధారం ఉందా అంటే అదీ లేదు...!

locals shocked after seeing sticks support to compound wall in kukatpally

author img

By

Published : Jan 30, 2021, 2:34 PM IST

కూకట్​పల్లి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణీనగర్​లోని ఓ రెండంతస్తుల భవనం పక్కన గుంత తవ్వారు. భవనపు ప్రహరీ గోడ కంటే లోతుగా తవ్వటం వల్ల గోడ అవతలివైపు వాలి... పడిపోయే స్థితికి వచ్చింది. ఇది గమనించిన యజమానులు... గోడ పడిపోకుండా ఉండేందుకు కర్రలను సపోర్ట్​గా నిలిపి ఉంచారు.

locals shocked after seeing sticks support to compound wall in kukatpally
రెండంతస్తుల భవనం పక్కనే గుంత...

పడిపోకుండా కర్రలు..

గోడ కింది వరకు గుంత...

ఈ దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. కర్రలతో గోడను మాత్రమేనా... భవనాన్ని కూడా పడకుండా ఆపుతారా...? అంటూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. గుంత లోతుగా తీయటం, గోడకు సపోర్ట్​గా ఉంచిన కర్రలకు బలమైన ఆధారం లేకపోవటాన్ని చూసి... భవనంలో అద్దెకు ఉండేవాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.

గుంత తీసిన స్థలం

ఇదీ సంగతి: పక్షి గూళ్లలోకి చేరేందుకు పాము విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.