నల్సార్ విశ్వవిద్యాలయంలో 25 శాతం స్థానిక రిజర్వేషన్లు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీని ప్రకటించింది. నల్సార్ విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో స్థానిక విద్యార్థులకు సీట్లను 20 నుంచి 25 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చట్టసవరణ చేసింది. దీంతో పాటు మొత్తం సీట్లలో బీసీ, ఓబీసీలకు కోటా ప్రకారం సీట్లు కేటాయించనున్నారు. అందుకు అనుగుణంగా నల్సార్ నిబంధనలను సవరిస్తూ చట్ట సవరణ చేశారు.
సవరించిన చట్టం అమలు తేదీని 2021 నవంబర్ ఒకటిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించింది. నల్సార్ విశ్వవిద్యాలయ జనరల్ కౌన్సిల్ రిజర్వేషన్లను కేటాయించనుంది.
ఇదీ చూడండి: