ETV Bharat / city

'ధరలు పెంచినా.. తగ్గేదేలే' అంటూ తాగేస్తోన్న మందుబాబులు

Liquor Sales increased in Telangana: రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ప్రకారం ధరలు పెంచినా విక్రయాలు తగ్గడం లేదు. నెల రోజుల్లో రూ.3,330.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంతకుముందు మాసంతో పోలిస్తే రూ.530 కోట్లు అధికంగా మద్యం విక్రయాలు నమోదయ్యాయి.

Liquor prices in Telangana
Liquor prices in Telangana
author img

By

Published : Jun 20, 2022, 7:43 AM IST

Liquor Sales increased in Telangana: మద్యం ధరలు పెరిగినా విక్రయాలు తగ్గడం లేదు. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గత నెల 19న మద్యం ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై రూ.10, ఆర్డినరీ క్వార్టర్‌పై రూ.20, ప్రీమియం క్వార్టర్‌పై రూ.40 చొప్పున పెంచారు. ముఖ్యంగా చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ ధరను రూ.95 నుంచి రూ.120కి పెంచడంతో విక్రయాలపై ప్రభావం ఉంటుందని అధికారులు భావించారు. ఎందుకంటే మొత్తం మద్యం విక్రయాల్లో 40-50 శాతం అమ్ముడుపోయేది ఇదే కావడం గమనార్హం. కానీ, అంతకుముందు నెలతో పోల్చితే ధరలు పెంచిన అనంతరం మాసం రోజుల్లో ఏకంగా రూ.530 కోట్లకుపైగా ఎక్కువ అమ్ముడుపోయినట్లు వెల్లడైంది. డిపోల నుంచి సరకు కొనుగోళ్లను పెంచాలని వ్యాపారులకు అధికారులు లక్ష్యాలు నిర్దేశిస్తుంటారు. ఇది ఎప్పుడూ ఉండేదే అయినా.. ఈసారి ఎక్కువ ఒత్తిడి చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విక్రయాల సరళి ఇలా..

* మద్యం ధరలు పెరగకముందు నెల రోజుల్లో అంటే ఏప్రిల్‌ 19 నుంచి మే 18 వరకు రాష్ట్రంలో రూ.2,800.31 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. 28,37,109 కేసుల లిక్కర్‌, 54,74,733 కేసుల బీర్లు విక్రయించారు.

* ధరలు పెరిగిన అనంతరం నెల రోజుల్లో అంటే మే 19 నుంచి జూన్‌ 18 వరకు రూ.3,330.74 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. 30,52,184 కేసుల లిక్కర్‌, 57,36,884 కేసుల బీరు అమ్ముడుపోయింది.

* గతేడాది ఇదే నెల రోజుల కాలానికి (మే 19- జూన్‌ 18) రూ.2,103.70 కోట్ల విక్రయాలే జరిగాయి. 26,57,614 కేసుల లిక్కర్‌, 21,70,641 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల్లో రూ.1,227.04 కోట్లు అధికంగా విక్రయాలు జరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.