AUDIO VIRAL: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి.. అధికారులు తంటాలు పడుతున్నారు. మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని.. లేదంటే ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టబోనని మహిళా అధికారి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎమ్మెల్సీ ఆడియో వైరల్..
ఇక తెలంగాణలోనూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫోన్లో పరుష పదజాలం ఉపయోగిస్తూ మహేందర్‌రెడ్డి సీఐని బెదిరించారు. మూడు రోజుల కిందట తాండూరు పట్టణంలోని భద్రేశ్వర ఆలయం జాతరలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌తో వచ్చిన రౌడీషీటర్లకు పోలీసులు సహకరించారని ఆ ఆడియోలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. కార్పెట్ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు.
స్పందించిన సీఐ కార్పెట్ వేయడం, తీయడం మా పని కాదని సమాధానం ఇవ్వడంతో మరింత ఘాటుగా స్పందించిన మహేందర్ రెడ్డి... నీ అంతు చూస్తానంటూ బెదిరించారు. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి..
సీఐపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. ఆడియో వైరల్!