Metro Rail on Electricity Charges: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ విద్యుత్ ఛార్జీల పెంపుపై హైకోర్టును ఆశ్రయించింది. మెట్రో రైళ్లకు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ రెగులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్‌సీ) అనుమతి ఇవ్వడాన్ని మెట్రో రైల్ హైకోర్టులో సవాల్ చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రభుత్వంతో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంది. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల నాలుగేళ్లుగా కొనసాగుతున్న నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో రైల్ వివరించింది. విద్యుత్ వినియోగ ఛార్జీల పెంపు వల్ల ప్రయాణికులపై కూడా అదనపు భారం వేయాల్సి వస్తుందని తెలిపింది. టీఎస్ఈఆర్‌సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ హైకోర్టును కోరింది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మెట్రో రైలు నిర్వహణ విద్యుత్ ఛార్జీలపై వివరణ ఇవ్వాలని డిస్కంలను ఆదేశిస్తూ మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Spacetech Policy: స్పేస్ టెక్నాలజీ పాలసీ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం