ETV Bharat / city

KTR tweet today: కేంద్రం అడ్డుపడ్డా.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదు

KTR tweet today: తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని అడ్డుకోలేరని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విటర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి ఆక్షేపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఫార్మాసిటీ వంటి ఏ అంశంలోనూ కేంద్రం తోడ్పాడు అందించకపోయినా.. తెలంగాణ తమ సత్తా చాటిందని ట్వీట్ చేసారు.

minister ktr tweet
మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
author img

By

Published : Sep 9, 2022, 10:53 PM IST

KTR tweet today: కేంద్రప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేసినప్పటికీ తెలంగాణ ఐటీ రంగం గత ఎనిమిదేళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ లోనే వచ్చిందని గుర్తుచేశారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందన్నారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందని, పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయ పెరుగుదల తెలంగాణలోనే అధికమని వివరించారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ అద్భుత వృద్ధి నమోదు అయిందన్న ఆయన... 20 వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 1.6 మిలియన్ మందికి కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించినట్లు తెలిపారు.

మిషన్ కాకతీయకు తోడ్పాటు ఇవ్వకపోయినా 20 వేల చెరువులు పునరుద్దరించామన్న కేటీఆర్... కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్యకళాశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించిందని... కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా పెండింగ్​లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథకు సాయం చేసేందుకు నిరాకరించినా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని అన్నారు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో... కలలు కనడం... వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  • At best you can put a few spokes in the wheel, but you can’t break our spirit or stop Telangana’s march to Glory

    ❇️ You scrapped ITIR-Hyd;yet we grew our IT output by 3.2 times in last 8 years, growing at 15% CAGR & last year, 1 out of 3 IT jobs created in 🇮🇳 was from Hyderabad https://t.co/EScLy2Q0Am

    — KTR (@KTRTRS) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.