అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీకి చెందిన కొవిడ్ టీకాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను వీలైనంత త్వరగా తొలిగించాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీకాల విషయంలో దేశానికి, ఫైజర్ సంస్థకు మధ్య ప్రతిష్టంభన నెలకొందన్న కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం మహమ్మారి గండం నుంచి బయట పడేందుకు టీకాలు వేయడమే మార్గమని అభిప్రాయపడిన కేటీఆర్... ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన తొలిగి టీకాలు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేటీఆర్ కోరారు.