ETV Bharat / city

'మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి'

KTR opens Flyover: అధికారంలోకి వచ్చిన 8ఏళ్లలో కేంద్రప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐడీపీఎల్‌ విషయంలో కేసులు వేయండని ఒక కేంద్రమంత్రి అంటున్నారని.. మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండని కేటీఆర్ సవాల్​ విసిరారు. సామాన్యుల మీద ఎనలేని భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కైతలాపూర్ ఫ్లైఓవర్‌ని మంత్రి ప్రారంభించారు.

KTR opens Flyover
author img

By

Published : Jun 21, 2022, 12:08 PM IST

Updated : Jun 21, 2022, 2:35 PM IST

KTR opens Flyover: హైదరాబాద్‌లో 8ఏళ్లలో తెరాస ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరో 17 ఫ్లైఓవర్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. నగరాభివృద్ధికి రహదారులు, ప్రజారవాణా వ్యవస్థే సూచిక అన్న కేటీఆర్‌... రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తువ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్‌... అగ్నిపథ్‌ విషయంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

'మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి'

'నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజారవాణ వ్యవస్థే. హైదరాబాద్‌ ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువుంది. దేశంలో ఔషధాల తయారీ కోసం ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేశారు. ఐడీపీఎల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా భూములిచ్చింది. ఐడీపీఎల్‌ విషయంలో కేసులు వేయండని ఒక కేంద్రమంత్రి అంటున్నారు. మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి. ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులపై కేసులు వేయవద్దని కోరుతున్నా. రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.'-కేటీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి

అధికారంలోకి వచ్చిన 8ఏళ్లలో భాజపా ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్న కేటీఆర్‌... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారన్నారు. పేదవారికి అండగా ఉండడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కేటీఆర్‌... త్వరలో కొత్త రేషన్‌కార్డులు కూడా మంజూరు చేస్తామన్నారు. రూపాయి లంచం లేకుండా రెండు పడకల ఇళ్లు అందిస్తున్నామన్నారు.

'మన బస్తీ- మన బడి ద్వారా పాఠశాలలు బాగు చేసుకుంటున్నాం. 57 ఏళ్లు వయసు దాటిన అర్హులైన వారికి త్వరలో పింఛన్లు. 2014 ముందు 29 లక్షల పింఛన్లు వచ్చేవి. ఇప్పుడు 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. పేదవారికి అండగా ఉండడమే తెరాస ప్రభుత్వ లక్ష్యం. త్వరలో కొత్త రేషన్‌కార్డులు కూడా మంజూరు చేస్తాం.'-కేటీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jun 21, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.