హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతుంటే.. కేంద్రం రూ.12 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెరాస కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉన్నందు వల్లే ముంబాయి మెట్రోకు రూ.18 వేల కోట్లు ఇచ్చిందన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా తలసాని సాయికిరణ్‌ను గెలిపించాలని యూసుఫ్‌గూడ రోడ్ షోలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: '12 ఈవీఎంలతో పోలింగ్ సజావుగా జరిగేనా'