ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సనత్నగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అండర్ బ్రిడ్జి వల్ల ఫతేనగర్, సనత్‌నగర్ రహదారిపై రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఏడాదిలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల 6.5 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. హైదరాబాద్‌లో దశలవారీగా 137 లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు