ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్(CISF) బలగాల కోసం ఉన్న వసతి, సౌకర్యాల వివరాలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో రెండో షెడ్యూల్ లో ఉన్న ప్రాజెక్టులు, సంబంధిత వాటి వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర జలశక్తిశాఖ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
దానికి స్పందించిన కేంద్ర హోంశాఖ సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించేందుకు అవసరమైన విధివిధానాలను కేంద్ర జలశక్తిశాఖ, బోర్డులకు పంపింది. అందులో వసతి, సౌకర్యాలకు సంబంధించి కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ అడిగిన అంశాల ఆధారంగా ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్న వసతి, సౌకర్యాల పూర్తి వివరాలను వీలైనంత త్వరగా పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు కోరింది.
ఇవీ చూడండి: KRMB: ఆ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు.. ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ