వెలిగొండతో పాటు తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌లు తక్షణమే సమర్పించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేసింది.
అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఆపాలని కేఆర్ఎంబీని కోరింది. తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరిన కృష్ణాబోర్డు... రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని కోరింది. తెలంగాణ ఫిర్యాదును కూడా లేఖతో పాటు జతపరిచారు.
ఇదీ చూడండి:
Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...