శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గురువారం లేఖ రాసింది. శ్రీశైలంలో ఎడమవైపు జల విద్యుత్తు కేంద్రం తెలంగాణకు, కుడివైపు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. రెండు రాష్ట్రాలూ ఉత్పత్తి అయిన విద్యుత్తులో యాభై శాతం వంతున వినియోగించుకుంటున్నాయి. బోర్డు సమావేశం నిర్ణయం ప్రకారం ఇది జరుగుతోంది.
అయితే నీటి వాటాల ప్రకారమే విద్యుదుత్పత్తిలోనూ వాటా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి నీటి విడుదలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖపై స్పందించిన బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ జలవనరుల శాఖకు లేఖ రాసింది. తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు బోర్డు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక యజమానికి జరిమానా