ETV Bharat / city

కోయంబేడు ఎఫెక్ట్​: ఆందోళనలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు

కోయంబేడు మార్కెట్ పేరు చెప్తే ఇప్పుడు ఏపీ ఉలిక్కిపడుతోంది. దీనికి కారణం ఇప్పుడది కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారటమే. తమిళనాడులో దీని కేంద్రంగా సుమారు 2 వేలకు పైగా కొవిడ్ బారిన పడ్డారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావంతోనే ఏపీలోనూ 60కు పైగా కేసులు నమోదయ్యాయి.

koyambedu effect
కోయంబేడు ఎఫెక్ట్​
author img

By

Published : May 14, 2020, 7:53 AM IST

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్‌ కల్లోలం సృష్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఇప్పుడది కొవిడ్‌కు కేంద్రంగా మారింది. చెన్నై మహానగర శివారులో 297 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వ్యాపార సముదాయం ద్వారా జరిగిన క్రయ, విక్రయాల నేపథ్యంలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్‌30న మార్కెట్‌లోని రిటైల్‌ లావాదేవీలను ఆపేయగా..మే5న హోల్‌సేల్‌ వ్యాపారాన్ని నిలిపివేశారు. అయితే 11 నుంచి పాక్షికంగా టోకు వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం దీని కేంద్రంగానే తమిళనాట సుమారు 2 వేలకు పైగా కేసులు.. ఆంధప్రదేశ్​లో 60కుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 50 కేసుల వరకూ లెక్క తేలాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కోయంబేడుకు రాకపోకలు సాగించారని అంచనా.

పెద్ద సంఖ్యలో అక్కడికే:

రోజుకు లక్ష మంది రాకపోకలు సాగిస్తుంటారు కోయంబేడు మార్కెట్​కు. ఇక్కడ పువ్వులు, కూరగాయలు, పండ్ల హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారం జరుగుతుంది. ఇందులో 2వేలు పెద్ద, 1,000 చిన్న దుకాణాలు ఉన్నాయి. 24 గంటలపాటు ఇక్కడ రద్దీ కనిపిస్తుంది. తమిళనాడులోని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే మార్కెట్​కు వెళ్తుంటారు. ఏపీ నుంచి ఆ మార్కెట్‌కు రాకపోకలు సాగించిన వారిలో.. ఇప్పటివరకు 1,500 మంది వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

వ్యాపారులే కాకుండా..

కోయంబేడు మార్కెట్‌తో వ్యాపార లావాదేవీలు సాగించిన పలు జిల్లాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని.. వివిధ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారని తెలుస్తోంది. వారిలో రైతులు, వ్యాపారులు మాత్రమే కాకుండా...లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. వీరికి వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో విదేశాలు, దిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో తీసుకున్న చర్యలే కోయంబేడు మార్కెట్‌ వ్యవహారంలోనూ తీసుకుంటున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లోనే వైరస్​ ముప్పు అధికం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.