హైదరాబాద్‌లోని మియాపూర్, జయప్రకాష్ నగర్ కాలనీలో 108వ డివిజన్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్‌కు గెలుపును ఆకాంక్షిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందని నామ అన్నారు.
కేంద్రానికి మొసలి కన్నీరు
తెలంగాణ వచ్చిన అనంతరం ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌లో 68వేల కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తాయన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించటంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా... ఇప్పటివరకు విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.
తెరాసలో చేరిన కాంగ్రెస్, తెదేపా నాయకులు
ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని నామ స్పష్టం చేశారు. ఇంకా అభివృద్ధి జరగడానికి తెరాసను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, తెదేపాలకు చెందిన పలువురు నాయకులు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. మక్త మహిబూబ్పేట నుంచి గుండె దయానంద్, కాసాని శ్రీధర్ నాయకత్వంలో తెదేపాకు చెందిన కె.ప్రభాకర్, పి.నర్సింగరావు, సీహెచ్.రాజు... కాంగ్రెస్‌కు చెందిన టి.నర్సింహాగౌడ్, సుభాష్ చంద్రబోస్, అల్లబోయిన సంతోష్ తదితరులను కండువా కప్పి ఎంపీ నామ పార్టీలోకి ఆహ్వానించారు. 108వ డివిజన్లో పోటీ చేస్తున్న శ్రీకాంత్‌ను గెలిపించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదు: కేకే