దేశ నిర్మాణంలో పౌరులు ముఖ్య భూమిక పోషించాలని కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన 'జాతి నిర్మాణంలో పౌరుల బాధ్యత' అనే సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాభివృద్ధి, సంక్షేమం వంటి పలు కార్యక్రమాల్లో పౌరులు తమ శక్తిమేర భాగస్వామ్యం కావాలని.. అందుకు వారిని ప్రేరేపించేలా ఇటువంటి సదస్సులు దోహదపడతాయని ఆయన అన్నారు. త్వరలో ఈ సదస్సులు దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాలు నిర్వహిస్తామని.. సంవత్సరాంతానికి దుబాయి, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏర్పాటు చేస్తామని నిర్వహకులు తెలిపారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి: కేరళ గవర్నర్
దేశాభివృద్ధి, సంక్షేమం వంటి పలు కార్యక్రమాల్లో పౌరులు తమ శక్తిమేర భాగస్వామ్యం కావాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.