తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తెరాస 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. మరోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.
హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీ ప్రాంగణానికి కేసీఆర్ రాకతో సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా గులాబీ దళపతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన గులాబీజెండా రెండు దశాబ్దాలు(20 years of trs party) పూర్తి చేసుకుంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. స్వీయ రాజకీయ అస్థిత్వం పేరిట తిరుగులేని శక్తిగా..... తెరాసను తీర్చిదిద్దారు. ఏప్రిల్ 27న ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ(20 years of trs party).. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ఇదీ చదవండి : TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి...