ETV Bharat / city

నత్త నడకన కాళేశ్వరం 17, 18, 19  ప్యాకేజీల పనులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు, నిజాంసాగర్‌ జలాశయాల్లోకి నీటిని మళ్లించే కీలకమైన పనులూ నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో విపరీత జాప్యం ఘనమైన లక్ష్యానికి విఘాతంగా పరిణమిస్తోంది. సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్న సంకల్పం ఇప్పట్లో సిద్ధించేట్టు లేదు. ఇదే రీతిలో సాగితే మరో మూడేళ్లు  పట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నత్త నడకన కాళేశ్వరం 17, 18, 19  ప్యాకేజీల పనులు
నత్త నడకన కాళేశ్వరం 17, 18, 19 ప్యాకేజీల పనులు
author img

By

Published : Mar 12, 2021, 5:02 AM IST

పనుల్లో విపరీత జాప్యం ఘనమైన లక్ష్యానికి విఘాతంగా పరిణమిస్తోంది. సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్న సంకల్పం ఇప్పట్లో సిద్ధించేట్టు లేదు. సింగూరు, నిజాంసాగర్‌ జలాశయాల్లోకి నీటిని మళ్లించే కీలకమైన పనులూ నత్తనడకన సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనుల పరిస్థితి ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కన్నట్లుగా ఉంది. ఇదే రీతిలో కొనసాగితే పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

మల్లన్నసాగర్‌ నుంచి 113 కి.మీ. దూరంలో ఉన్న సింగూరుకు నీటిని మళ్లించడం, మార్గమధ్యలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, ప్రధాన కాలువ 27వ కి.మీ. నుంచి హల్దియా వాగు ద్వారా 2,927 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌కు మళ్లించే పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. మొదట 2009లో, తర్వాత మార్పులు చేసి 2017లో గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం 28 ప్యాకేజీలుగా విభజించగా, మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు వరకు నీటిని మళ్లించడానికి 17, 18, 19 ప్యాకేజీలుగా చేపట్టారు. మల్లన్నసాగర్‌ నుంచి ఏడు కిలోమీటర్ల తర్వాత ఇవి ప్రారంభమవుతాయి.

17వ ప్యాకేజీ.. మల్లన్నసాగర్‌ నుంచి 5,791 క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు 18.6 కిలోమీటర్ల దూరం తొమ్మిది మీటర్ల వ్యాసంతో సొరంగం, 4.5 కి.మీ. కాలువ తవ్వాల్సి ఉంది. 2017 అక్టోబరులో రూ.986 కోట్లతో ఐటీడీ సిమెంటేషన్‌ సంస్థతో ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు 2.8 కి.మీ దూరం సొరంగమార్గం మాత్రమే పూర్తయింది. మొత్తమ్మీద 21 శాతం పని జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పనిని ఓ ప్రజాప్రతినిధికి చెందిన సంస్థ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో లక్ష్యం ప్రకారం చేయాలని ఇంజినీర్లు ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని తెలిసింది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకొని వేగం పెంచాలని ఒత్తిడి చేయడంతో నెలకు 400 మీటర్ల పనిని పూర్తి చేస్తున్నట్లు సమాచారం. మరో రెండేళ్లు గడువు పొడిగించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్యాకేజి కింద ఆయకట్టు లేదు.

18వ ప్యాకేజీ.. నాలుగు కి.మీ దూరం సొరంగమార్గం, 45 కి.మీ. కాలువ తవ్వే పనిని మధుకాన్‌ సంస్థ రూ.758 కోట్లకు దక్కించుకొంది. దీనికి కూడా 2017లోనే ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు 1.4 కి.మీ. దూరం సొరంగ మార్గం, 13 కి.మీ. కాలువ తవ్వకం పూర్తయింది. 27వ కి.మీ. వద్ద నుంచి హల్దియా వాగు ద్వారా 2,927 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌కు మళ్లిస్తారు. 15వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. మొత్తమ్మీద నాలుగేళ్లలో 27 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

19వ ప్యాకేజి.. 12 కి.మీ. ప్రధాన కాలువ తవ్వకంతోపాటు 78 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులను పూర్తి చేయాల్సి ఉంది. రూ.762 కోట్లకు దీనిని గ్యామన్‌ ఇండియా సంస్థ దక్కించుకొంది. అనధికారికంగా ఓ ఉపగుత్తేదారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తొమ్మిది శాతం మాత్రమే పూర్తయింది. మొత్తం పూర్తయితే కాళేశ్వరం నీళ్లు మంజీరాను దాటతాయి.

సింగూరుకు నీటిని చేర్చడానికి 82 కి.మీ. నుంచి 107.8 కి.మీ. వరకు పనులు చేపట్టాల్సి ఉంది. దానికి త్వరలోనే టెండర్‌ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. మార్గమధ్యలో మళ్లించే నీరు, ఆయకట్టుకు వినియోగం పోనూ సుమారు 1,835 క్యూసెక్కులు సింగూరుకు చేరతాయి.

ఇదీ చదవండి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు నేడు రాష్ట్రంలో అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.