హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణం చేయించారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. విజయసేన్ రెడ్డి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కి చేరింది.
విజయ్‌సేన్ రెడ్డి మద్రాస్, కేరళ హైకోర్టులకు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుమారుడు. విజయ్ సేన్ రెడ్డి 1970, ఆగస్టు 22న జన్మించారు. హైదరాబాద్ పీఆర్ఆర్ లా కళాశాలలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. 1994 డిసెంబరు నుంచి హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామకం