ETV Bharat / city

మంత్రి హరీశ్‌రావు తీరుపై జూనియర్ వైద్యుల అభ్యంతరం..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీరుపై జూడా సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. జూనియర్​ డాక్టర్లను సస్పెండ్​ చేయడాన్ని తప్పుబట్టింది. ఎలాంటి దర్యాప్తు లేకుండా వైద్యులను ఎలా సస్పెండ్ చేస్తారని జూడాలు ప్రశ్నించారు.

Junior doctors object to Minister Harish Raos attitude

author img

By

Published : Jun 7, 2022, 7:53 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ వైద్యులను అకారణంగా సస్పెండ్ చేయడంపై జూనియర్ వైద్యుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరిపడా మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసింది. రోగులను కాపాడేందుకే అత్యవసర మందుల కోసం వైద్యులు బయటికి రాస్తున్నారని జూడాలు స్పష్టం చేశారు. మందులు అందుబాటులో ఉన్నా కూడా రాయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎలాంటి దర్యాప్తు లేకుండా వైద్యులను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. రోగులకు అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెడుతున్నా.. సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీబావం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు బడ్జెట్​లో సరిపడా నిధులు కేటాయించి రోగులకు అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరింది.

"ప్రభుత్వ ఆస్పత్రిల్లో మందుల కొరత వల్లే బయటికి పంపుతున్నాం. మందులు ఉన్నాయో లేదో చూసుకోవడం వైద్యుల పనికాదు. ఔషధాల కోసం పంపే ప్రతిపాదనలను పట్టించుకోవట్లేదు. ఔషధాలు ఉన్నా బయటికి రాసే వారిపైనే చర్యలు తీసుకోవాలి. ఎలాంటి దర్యాప్తు చేయకుండా వెంటనే సస్పెన్షన్ అంటే ఎలా? ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారా? ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందితేనే ప్రశ్నించే అర్హత ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాల సంగతి మంత్రి హరీశ్‌రావుకు తెలుసు. హరీశ్‌రావు ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు." - జూడాలు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.