ETV Bharat / city

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్ - ఏలూరు ఘటనపై పవన్ కల్యాణ్ కామెంట్స్

ఏపీలోని ఏలూరులో వింత వ్యాధి వల్ల వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. బాధితుల కోసం తగిన వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను జనసేన ప్రతినిధులు పరిశీలించి ఓ నివేదిక రూపొందించాలని పవన్ అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం ఉన్న ఏలూరులో పిల్లలకు ఐసీయూ లేదన్నారు. 500 పడకల ఆస్పత్రిలో ఒక్క న్యూరోఫిజీషియన్ లేరన్నారు. వ్యాధికి కలుషిత నీరు కారణంగా భావిస్తున్న సమయంలో బాధిత ప్రాంతాల్లో ట్యాంకర్ల మంచి నీరు అందించడంలేదని విమర్శించారు.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్

author img

By

Published : Dec 9, 2020, 4:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఇంకా కొనసాగుతున్నా... బాధితుల కోసం తగిన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు జనసేన పార్టీ తరఫున డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణతో కూడిన బృందాన్ని అక్కడికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించిన ముగ్గురు డాక్టర్ల బృందం నివేదికను తనకు అందజేసిందని పవన్‌ తెలిపారు.

500 పడకల ఆసుపత్రిలో న్యూరోఫిజీషియన్ లేరు

చిన్న పిల్లలకు ఐసీయూ లేకపోవడం, ఈ అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు ఆవేదన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు. బాధితులు మూర్ఛతో బాధపడుతుంటే చికిత్స అందించవలసింది న్యూరోఫిజీషియన్ అయినప్పుడు విజయవాడ నుంచి వైద్యులను ఎందుకు రప్పించలేదని ప్రశ్నించారు. ఈ వ్యాధికి కలుషిత నీరు ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

80శాతం మందిలో నీరసం, తలనొప్పి

ముఖ్యమంత్రి ఏలూరు వెళ్లిన తర్వాత కూడా అదనపు సదుపాయాలు ఏర్పాటు కాలేదని... సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. తమ బృందం పరిశీలన ప్రకారం... వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఒక్కసారి మాత్రమే మూర్ఛ వస్తోందని... కొంతమందిలో మతిమరపు, వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయని... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కూడా 80 శాతం మందిలో నీరసం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రత్యేకించి ఫలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదని.. అన్ని వయసుల వారు అస్వస్థతకు గురవుతున్నారన్నారు.

వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవు!

వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని... వ్యాధి బారిన పడినవారు ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్​ అవుతుండడం... ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడకపోవడం సంతోషించాల్సిన అంశాలని పవన్ అన్నారు. ఏలూరులో మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాలైన దెందులూరు, నారాయణపురం, కొవ్వలి, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో కూడా ఫిట్స్ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. వ్యాధిబారిన పడ్డ వారిలో సీటీ స్కాన్, రక్త నమూనాలు పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయన్నారు. తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా అందులో పరిమితికి మించి లెడ్, నికెల్ వంటి లోహాలు లేవని అధికారులు ఇప్పటికే ప్రకటించారన్నారు. అలాగే వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్‌ పరీక్షల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడలేదన్నారు.

కూరగాయల నమూనాలను పరీక్షించాలి

వాయు కాలుష్యం వల్ల వ్యాధి విస్తరించలేదని... నీటి కాలుష్యం లేదా ఆహార కాలుష్యం వల్ల వ్యాధి ప్రబలి ఉంటుందనే అనుమానాన్ని పవన్ వ్యక్తం చేశారు. ఏలూరులో మత్స్య పరిశ్రమ ఎక్కువగా ఉందని.. వాటి వ్యర్థాలు ఏమైనా తాగునీటిలో కలవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకున్నారని.. చేపల చెరువులో వాడిన రసాయనాల వల్ల కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయనే సందేహాన్ని వెలిబుచ్చారు. కూరగాయలపై చల్లిన రసాయనాల వల్ల కూడా వ్యాధి రావొచ్చు కనుక వెంటనే కూరగాయల నమూనాలను నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్​కు పంపించి పరీక్షించాలని పవన్‌ కోరారు.

న్యూరోఫిజీషియన్ ఉండాల్సిన స్థానంలో న్యూరో సర్జన్

రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలు పంపించాలని జనసేనాని సూచించారు. ఏలూరులో నీటి కాలుష్యం చాలా ఏళ్లుగా ఉందని... మంచినీటి పైపులైన్లల్లో డ్రైనేజీ నీటి కలిసిపోతుంటాయని... అలా జరగడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే మున్సిపల్ వాటర్​ను సరిగా క్లోరినేషన్ చేయకపోవడం, క్వాలిటీ బ్లీచింగ్ పౌడర్ వాడకపోవడం కూడా ఒక కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. న్యూరోఫిజీషియన్ ఉండాల్సిన స్థానంలో న్యూరోసర్జన్​ను పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడంలో చూపించిన శ్రద్ధ.. రోగుల ఆరోగ్యంపై చూపించలేదని ఆరోపించారు. మెదడుకు సంబంధించిన వ్యాధి అని తెలిసినప్పుడు కనీసం ఐదారుగురినైనా న్యూర్యాలజిస్టులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బాధితులకు వైద్యం చేయించాల్సిందన్నారు.

కాలం చెల్లిన మందులు పంపిణీ!

ఆస్పత్రిలో కనీసం ఒక్క న్యూరోఫిజీషియన్ కూడా లేరని... ఆస్పత్రిలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు వారి విజ్ఞానం మేరకు వైద్యం చేస్తున్నారని, నిపుణుల సేవలు అందడం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. విజయవాడ నుంచి నలుగురు న్యూరాలజిస్టులను మాత్రం ప్రభుత్వం తరలించలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది కచ్చితంగా క్రిమినల్ నెగ్లిజన్సు కిందకే వస్తుందని ఆరోపించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకా అయిన ఏలూరు ఆస్పత్రిలో పిల్లలకు ఐసీయూ లేదని... వ్యాధికి గురవుతున్న వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారన్నారు. బాధిత ప్రాంతాల్లో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నారని... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లీచింగ్ చల్లలేదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : అంజూ.. పతకంతో పాటు మనసుల్ని గెలిచింది అలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.