మిషన్ భగీరథ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకమని జాతీయ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ సాహు అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆయన లేఖ రాశారు. మంచినీటి సరఫరాలో తెలంగాణ సాంకేతిక విధానం అనుసరిస్తోందని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా నీటి వృధాను అరికట్టి, అవసరమైన మేరకే నీరు సరఫరా చేయవచ్చన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికతను వాడాలని సూచించారు.
దీనిపై అధ్యయనానికి తెలంగాణకు బృందాలు పంపాలని లేఖలో సూచించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు.