ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రిజియన్కు గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. రెండు సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఈ కార్యవర్గం మంగళవారం ఏర్పడినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా డి. సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులుగా బి. సాయి ప్రసాద్, శివ శంకర్ నాయక్, కోశాధికారిగా ఎం. ప్రఫుల్రాజ్ ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: వారి వద్ద అణుబాంబులకు వాడే ముడి సరకు- విలువ వేల కోట్లు