ఐటీ, పరిశ్రమల శాఖలపై ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు.. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే ప్రణాళికలు, కార్యచరణపై అధికారులతో చర్చించారు. సోమవారం ఖమ్మం పట్టణంలోని ఐటీ టవర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించగా.. మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఐటీ పరిశ్రమలు మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
ఒకటి రెండు ప్రముఖ కంపెనీలు త్వరలోనే వరంగల్ నగరానికి వస్తాయని, ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో తెలంగాణ ఐటీ శాఖ చర్చలు నిర్వహిస్తుందన్నారు. వరంగల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు అవసరమైన మౌలికసదుపాయాల కల్పనపై టీఎస్ఐసీ ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంపల్లి ప్రాంతంలో ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తిచేసి.. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ నరసింహరెడ్డికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మహబూబ్నగర్ దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి : రైతుబంధు నిధులు, పంపిణీపై సోమవారం సీఎం సమీక్ష