ETV Bharat / city

ఐటీ రంగం వృద్ధితో మారిపోయిన నగర స్వరూపం - హైదరాబాద్​ వార్తలు

రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంతో...నగర రూపురేఖలు మారిపోతున్నాయి. సాంకేతిక, బహుళజాతి సంస్థలు కొలువుతీరుతున్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో కొత్తగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్న సంస్థలను నగర శివారు ప్రాంతాలకు విస్తరింపజేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అన్ని వైపులా సమాన అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు లుక్ ఈస్ట్, లుక్ నార్త్, గ్రిడ్ పాలసీలతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం సూచిస్తున్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ నగరంతో పాటు, శివారు ప్రాంతాలను వృద్ధి బాట పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.

IT industry on growth path in hyderabad
ఐటీ రంగం వృద్ధితో మారిపోయిన నగర స్వరూపం
author img

By

Published : Nov 20, 2020, 8:39 PM IST

ఐటీ రంగం వృద్ధితో మారిపోయిన నగర స్వరూపం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. లక్షల కోట్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. ఐటీ, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్​కు కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. నగరానికి ఆధునిక హంగులు అద్దిన... ఐటీ రంగం వృద్ధితో నగర స్వరూపం మారిపోయింది. ఐతే ఐటీ సంస్థలు ఎక్కువగా.. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోనే విస్తరించడం వల్ల మిగతా నగరానికి భిన్నంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దీంతో నగరంలో నూతన కార్యాలయాలను ప్రారంభించనున్న సంస్థలను, తద్వారా వచ్చే అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం... అందుకు గ్రోత్ ఇన్ డిస్‌పర్షన్- గ్రిడ్‌ పాలసీని తీసుకొచ్చింది. లుక్ ఈస్ట్, లుక్ నార్త్ ఫర్ ఐటీ అనే విధానంతో నగరం తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోనూ ఐటీ విస్తరించేలా ప్రోత్సహిస్తోంది.

గణనీయంగా పెరుగుతోన్న ఐటీ

హైదరాబాద్‌ నుంచి దాదాపు 2 వేల ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా...7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధి గణనీయంగానే పెరుగుతోంది. గతేడాది ఈ రంగం 17 శాతం వృద్ధిని నమోదు చేయగా.. కొవిడ్ పరిస్థితుల్లోనూ 10 శాతం వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే.. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు పది లక్షలకు చేరుకుంటారని ఓ అంచనా. ఇంతటి ముఖ్యమైన రంగాన్ని నగరమంతటా విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. అందుకు నగరం నలువైపులా మౌలిక వసతులను కల్పిస్తూ కొత్త సంస్థలకు స్థలాలను కేటాయిస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు అందించేందుకు విధాన నిర్ణయం తీసుకుంది.

ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆమోదం

నగరంలోని ఉప్పల్, నాగోల్, పోచారం, మహేశ్వరం, తుక్కుగూడ, ఆదిభట్ల, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కొత్త కంపెనీలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతాల్లో ఐదు ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించేలా ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. వరంగల్, ఖమ్మం, కరీనంగర్, నిజామాబాద్, మహబూబ్​నగర్ వంటి నగరాల్లో ఐటీ కారిడార్‌లు, టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్‌లో కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా... త్వరలోనే మిగతా చోట్లా ఐటీ టవర్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆఫీస్​ స్పేస్​కు పెరుగుతున్న డిమాండ్​

హైదరాబాద్‌ భౌగోళిక పరిస్థితుల కారణంగా భూకంపాలు రాని సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీంతో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం... డాటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ పాలసీలను తీసుకొచ్చింది. కంపెనీల విస్తరణ, పెట్టుబడుల వెల్లువతో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో నగరంలో ఆఫీస్ స్పేస్ మూడింతలు పెరగ్గా.. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దీంతో భాగ్యనగరంలోని భూముల విలువల భారీగా పెరుగుతోంది.

త్వరలోనే కొరియన్ ఇండస్ట్రియల్ పార్కు

కొవిడ్ కాలంలోనూ నగరానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. లాజిస్టిక్స్, తయారీ, లైఫ్​ సైన్సెస్, ఫార్మా, హార్డ్‌వేర్ సంస్థలు రాష్ట్రానికి వరుస కట్టాయి. ఈ సంస్థలకు స్థలాలు కేటాయించేందుకు గానూ నగర వ్యాప్తంగా 20 వరకు పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, శంకర్‌పల్లి, సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లోని పారిశ్రామిక క్లస్టర్లల్లో సంస్థలకు స్థలాలు కేటాయిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కొరియన్ కంపెనీలను ప్రోత్సహించేందుకు... త్వరలోనే కొరియన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నైపుణ్యాలు పెంపొందించేలా..

ప్రస్తుత పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను అవసరం అవుతాయి. అందుకే నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటుంది. సంస్థలు, ఉద్యోగాలు పెరుగుదల ముందస్తు అంచనాలతో వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టు కింద మెట్రో మార్గాన్ని మరింత పెంచేందుకు యోచిస్తోంది. నగరంలో పెరగనున్న జనాభా అవసరాలు తీర్చేందుకు, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది.

పక్కా ప్రణాళికతో..

నగర పరిధి వేగంగా విస్తరిస్తున్నా.. ఆధునిక మౌలిక వసతుల కల్పన కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే... భవిష్యత్‌ కార్యచరణకు పక్కా ప్రణాళిక రచించి ముందుకు సాగుతోంది. అందుకు ఐటీ, ఇతర సంస్థల విస్తరణను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. ముందస్తు వ్యూహంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా మంచి ఫలితాలనిస్తున్నాయి.

ఇవీ చూడండి: గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.