ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: పిల్లల మారాం.. తల్లిదండ్రులకు తలనొప్పి - పిల్లలపై లాక్​డౌన్​ ప్రభావం

కరోనా లాక్​డౌన్​.. స్కూల్స్​ లేవు. పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన వాళ్లు... ఫ్రెండ్స్​తో కలిసి ఆడుకుంటామని మారం చేస్తున్నారు. వారిని కట్టడి చేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. ఈ సమయంలో పిల్లలు బయటకు రావడం ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

parents
parents
author img

By

Published : Jun 10, 2020, 10:52 AM IST

కరోనా నేపథ్యంలో రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు కష్టంగా ఉంది. చుట్టుపక్కల మిత్రులతో కలిసి ఆడుకుంటామని మారాం చేస్తుంటే కాదనలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో పిల్లలు బయటకు రావడం ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్కనే ఆడుకుంటామంటూ పిల్లలు బయటకు తుర్రుమంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పది మంది పిల్లలు కలిస్తే ప్రమాదమనే ఆందోళనతో గడపాల్సి వస్తోందని, వాళ్లు కొద్దిగా దగ్గినా, తుమ్మినా భయం మొదలవుతోందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే పిల్లలను సంరక్షించడం మరింత ఇబ్బంది. ఉద్యోగాలకు వెళ్లక తప్పదు. పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లల్ని ఎక్కడ ఉంచాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.

డిజిటల్‌ తెరలతో ప్రమాదం

బయటకు వెళ్లవద్దంటే పిల్లలు ఇంట్లోనే టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపవచ్చని, పాఠశాలలు మొదలైన తర్వాత కూడా వీటిని నివారించడం కష్టమని భయపడుతున్నారు. గతంలో ఎండాకాలం వస్తే పిల్లలకు ఈత, సంగీతం, నృత్యం వంటివి నేర్పించేవాడినని, ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో వాళ్లు టీవీని వదిలిపెట్టడంలేదని హైదరాబాద్​కు చెందిన ఒక వ్యక్తి వెల్లడించారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

  • రోజూ ఇంటికి వచ్చిన వెంటనే 20 నిమిషాల పాటు పిల్లలను దగ్గరికి తీసుకుని గోముగా మాట్లాడాలి.
  • పిల్లల ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని వారికి అవసరమైన సామగ్రి సమకూర్చాలి.
  • ఇంట్లో తగాదాలు, గొడవలకు పిల్లలను దూరంగా పెట్టాలి. కరోనా అంటే భయం కాకుండా ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి.
  • అపార్టుమెంట్లలో ఉండే వారు పిల్లలు ఆడుకునే ప్రాంతాలను శానిటైజ్‌ చేయాలి. పార్కుల్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలి. ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని పిల్లలు భౌతికదూరం పాటించేలా చూస్తుండాలి.

అవకాశంగా మలచుకోవాలి

ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి. రాబోయే రోజుల్లో అయినా పిల్లలు బయటకు వెళ్లక తప్పదు కనుక కరోనా నుంచి తప్పించుకునేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై ఒకటికి పదిసార్లు శిక్షణ ఇవ్వాలి. ఈ మూడూ వారి దైనందిన జీవితంలో భాగమయ్యేలా చేయాలి. పాఠశాలలు తెరిచాక కూడా ఈ అలవాట్లు ఉపయోగపడతాయి. పిల్లల్ని వీలైనంత వరకూ ఇంట్లోనే ఉంచాలి. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా వారితో ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి.

పిల్లలతో ఆటలు ఆడాలి. కథలు చెప్పాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. ఇంటిపనుల్లో భాగస్వాముల్ని చేయాలి. తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తే వారు కూడా చెప్పేది వింటారు. వారి మానాన వారిని వదిలేసి తల్లిదండ్రులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతేనే కష్టం. మంచి అలవాట్లను చిన్న చిన్న ఆటల ద్వారా నేర్పించాలి. నోరు, ముక్కు, కళ్లపైకి చేతులు వెళ్లకుండా ఉండేలా ఈ ఆటల ద్వారా బోధించాలి.

-డాక్టర్‌ వి.ఎన్‌.విశ్వనాథ్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌

ఇదీ చదవండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.