చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. రూ.2.63 లక్షలు, 12 తులాల బంగారం గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు చేశారు. శ్రీనివాస్ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.

ఇదీ చదవండి: నగదు నిల్వల్లో అక్రమాలు.. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు