రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టుకుంది. ఎడతెరపి లేని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు(Heavy Floods to Projects) దూకుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు వరద ఉద్ధృతి పెరిగింది. హైదరాబాద్‌లో.. కురుస్తున్న ముసురుతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఖమ్మం జిల్లాలో వాగులకు పోటెత్తిన వరద..
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న జోరు వానకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. జిల్లాలో ప్రధానమైన వైరా జలాశయం(Heavy Floods to Projects) 18.3 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి 19.6 కు చేరింది. ఎగువన కారేపల్లి కొనిజర్ల ఏన్కూర్ మండలాల నుంచి వరద వైరా జలాశయానికి చేరుతోంది.
కడెం ప్రాజెక్టుకు భారీ వరద..
నిర్మల్ జిల్లాలో గత రెండురోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు జలాశయాలు నిండుకుండలా(Heavy Floods to Projects) మారాయి. జలాశయాల నుంచి వదలిన నీటితో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. కడెం నారాయణరెడ్డి జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 7 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు( 7.603 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటి మట్టం 695.950 అడుగులకు(6.586 టీఎంసీలు) నిలకడగా ఉంచుతున్నారు.
నిండుకుండలా స్వర్ణ జలాశయం..
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయం(Heavy Floods to Projects)లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1183 అడుగులకు నీరు చేరుకుంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో 69,500 క్యూసెక్కులు ఉండగా అప్రమత్తమైన అధికారులు 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం(Heavy Floods to Projects) పెరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరింది. ఉదయానికి ఆ ప్రవాహం 70వేలు దాటింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి నీరు రావడం వల్ల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులుండగా.. ప్రస్తుతం 1089 అడుగుల మేర నీరు చేరింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 64 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఎగువన మహారాష్ట్రలోని బాలేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్లు ఎత్తి ఉంచడంతో ఆ నీరంతా నేరుగా ఎస్సారెస్పీ లోకి వచ్చి చేరుతోంది.
కౌలాస్ నాలా 3 గేట్లు ఎత్తివేత..
కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 458 అడుగులకు చేరగా.. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లికి జలకళ..
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 54 వేల క్యూసెక్కులు ఉంది. 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 20.74 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 19.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్‌కు భారీ వరద..
నాగార్జునసాగర్ జలాశయానికి 28,815 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 972 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 534.80 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 177.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పోటెత్తుతున్న జూరాల..
జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది(Heavy Floods to Projects). జలాశయం ఇన్‌ఫ్లో 58,600 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 66,090 క్యూసెక్కులు ఉంది. 6 గేట్లు ఎత్తి.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహం..
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది(Heavy Floods to Projects). జలాశయంలోనికి 68,491 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 844.90 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 69.90 టీఎంసీల నీరు ఉంది.