ETV Bharat / city

అదిరిపోయే టూర్​ ప్యాకేజీని అందిస్తోన్న ఐఆర్​సీటీసీ - telangana varthalu

కొవిడ్‌ కారణంగా ప్రశాంతతకు దూరమయ్యారా?.. యాత్రలకు వెళ్లలేకపోయారా?.. మీకు ఊరట కలిగించేందుకు ఐఆర్‌సిటీసీ దక్షిణ భారత్ యాత్రకు గ్రీన్​సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భారతంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

అదిరిపోయే టూర్​ ప్యాకేజీని అందిస్తోన్న ఐఆర్​సీటీసీ

author img

By

Published : Jan 12, 2021, 3:43 PM IST

తక్కువ ఖర్చుతో ఐఆర్​సీటీసీ దక్షిణ భారత్‌ యాత్రను ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు యాత్రలకు వెళ్లేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో స్లీపర్‌ క్లాస్‌, ఏసీ కోచ్‌, త్రీటైర్‌ ఏసీ కోచ్‌లకు అవకాశం కల్పించారు. వెళ్లాలనుకునే వారు ఎక్కడికో వెళ్లి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఆన్​లైన్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకునే విధానాన్ని ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టింది.

ఈ నెల 22న

తిరుచిరాపల్లి - తంజావూర్‌ -రామేశ్వరం-మధురై- కన్యాకుమారీ వెళ్లడానికి ఈనెల 22న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌ నుంచి ఈ యాత్రలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు వీలుగా స్టాప్‌ సౌకర్యం ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికుడికి రూ.7140 (స్టాండర్డ్​ ఛార్జీలు) అన్ని వసతులతో కలిపి ప్రత్యేక రైలును నడిపిస్తున్నారు. రూ 8610 (కంఫర్ట్ ఛార్జీ) ఛార్జీ రూపంలో వసూలు చేస్తారు.

మార్చి 3న

మార్చి 3న జగన్నాథ్‌ థామ్‌ యాత్రకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. సికింద్రాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం వంటి రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరి వెళ్లవచ్చు. ఒక్కొక్క ప్రయాణికుడికి రూ.5250( స్టాండర్డ్), రూ.6300 (కంఫర్ట్‌) ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు.

ప్రతి బోగికి ఇద్దరు సెక్యూరిటిగా ఉంటారు. రైలు ఛార్జీలు తప్పా ఒక్క పైసా చేతి నుంచి ఖర్చు పెట్టనవసరం లేదని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

మరిన్ని వివరాల కోసం:

ఫోన్‌ నెంబర్లు 04027702407/ 9701360707/ 8287932227 (సికింద్రాబాద్‌ ), విజయవాడ సెల్‌ నెంబరు- 8287932312, తిరుపతి సెల్‌ నెంబరు - 8287932313, విశాఖపట్నం సెల్‌ నెంబరు - 828793238 నెంబర్లను సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

ఇదీ చదవండి: సాయంత్రం కొవాగ్జిన్ టీకా తరలింపు ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.