ETV Bharat / city

iPhone SE 5G: ఐఫోన్‌ ఎస్‌ఈ 5జీ ఇదిగో

iPhone SE 5G: 5జీ టెక్నాలజీతో పనిచేయనున్న ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్​ను యాపిల్‌ సంస్థ ఆవిష్కరించింది. ఈ మోడల్​ ధర, ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.

iPhone SE 5G
iPhone SE 5G
author img

By

Published : Mar 9, 2022, 3:08 PM IST

iphone se 5g price in india: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఐఫోన్‌ ఎస్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 5జీ టెక్నాలజీతో పనిచేయనున్న ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ ఇదే. యాపిల్‌ ఏ15 బయోనిక్‌ చిప్‌ కలిగిన ఐఫోన్‌ ఎస్‌ఈలో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ తెర, ట్రూటోన్‌ ఫ్లాష్‌తో 12 మెగాపిక్సెల్‌ కెమేరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12ఎంపీ ముందు కెమేరా అమర్చారు. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యాలు, ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది. ప్రారంభ ధరను 429 డాలర్లుగా నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి అమెరికాలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. శుక్రవారం నుంచి ముందస్తు ఆర్డర్‌ చేసుకోవచ్చు. భారత్‌లో ప్రారంభ ధర రూ.43,900గా ఉండొచ్చని చెబుతున్నారు.

ఐఫోన్‌ 13, 13ప్రో కొత్త రంగుల్లో: ఐఫోన్‌ 13, 13ప్రోలో రెండు కొత్త రంగులు గ్రీన్‌, ఆల్పిన్‌ గ్రీన్‌ వేరియంట్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఐఫోన్‌ 13 అయిదు రంగులు- స్టార్‌లైట్‌, మిడ్‌నైట్‌, బ్లూ, పింక్‌, ప్రోడక్ట్‌ రెడ్‌ల్లో లభిస్తోంది.

ఇదీ చూడండి: బంగారం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.