ETV Bharat / city

అసైన్డ్ భూముల కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు - interim orders in amaravthi assigned lands case

ఏపీ అమరావతి అసైన్డ్ భూముల కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​ను హైకోర్టు విచారించింది. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.

interim
మధ్యంతర ఉత్తర్వులు
author img

By

Published : Apr 16, 2021, 7:05 PM IST

ఏపీ అమరావతి అసైన్డ్ భూముల విషయంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటిని మరో మూడు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశించింది. అమరావతి భూముల వ్యవహారంలో తనపై సీఐడి అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో పిటీషన్లపై విచారించిన ధర్మాసనం దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా మరోసారి ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు ధర్మాసనం పొడిగించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి: సాగర్​ పోలింగ్​కు ఏర్పాట్లు.. పక్కాగా కొవిడ్​ నిబంధనల అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.