ETV Bharat / city

కేటీఆర్, డీకే శివకుమార్​ మధ్య ట్విటర్​లో ఆసక్తికర చర్చ

Minister KTR Tweets: మంత్రి కేటీఆర్, కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ మధ్య ట్విటర్​లో ఆసక్తికర చర్ఛ జరిగింది. ఇటీవల కేటీఆర్ చేసిన ట్వీట్​కు డీకే స్పందించారు. డీకే విసిరిన సవాల్​ను తాను స్వీకరిస్తున్నట్లు.. కేటీఆర్ తెలిపారు.

Interesting discussion between karnataka pcc chief DK Sivakumar and minister KTR in twitter
కేటీఆర్, డీకే శివకుమార్​ మధ్య ట్విటర్​లో ఆసక్తికర చర్ఛ
author img

By

Published : Apr 4, 2022, 12:14 PM IST

Updated : Apr 4, 2022, 12:41 PM IST

Minister KTR Tweets: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. బెంగళూరులో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా హైదరాబాద్ రావాలని ఓ అంకుర సంస్థను ఇటీవల కోరుతూ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు శివకుమార్ స్పందించారు. కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు... 2023 డిసెంబర్ నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అప్పుడు దేశంలోనే ఉత్తమనగరంగా బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన ట్వీట్‌ చేశారు.

డీకే ట్వీట్​పై స్పందించిన కేటీఆర్... తానూ సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. కర్ణాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా అవగాహన లేదని... ఎవరు గెలుస్తారో తెలియదని అన్నారు. అయితే.. హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీతో యువతకు ఉద్యోగాలు కల్పించి దేశ అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. హలాల్, హిజాబ్‌పై కాకుండా మౌళికసదుపాయాలు, ఐటీ, బయో టెక్నాలజీ రంగాలపై దృష్టి సారిద్దామని తెలిపారు.

  • Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍

    Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation

    Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT

    — KTR (@KTRTRS) April 4, 2022 ." class="align-text-top noRightClick twitterSection" data=" ."> .

ఇవీ చూడండి: MahaBrand Skotch Award: స్కోచ్ పురస్కారం కోసం పోటీపడుతోన్న 'మహాబ్రాండ్

Last Updated : Apr 4, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.