Inter Study Material : ఇంటర్‌బోర్డు రూపొందించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల స్టడీ మెటీరియల్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అందజేయనున్నారు. ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకే వాటిని అందించాలని గతంలో ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు తెలుగు అకాడమీ ముద్రించిన గ్రూపుల వారీగా పుస్తకాలను నాలుగు రోజుల క్రితం ఆయా కళాశాలలకు పంపించింది.
Inter Study Material to Govt Students : తాజాగా వాటిని రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ గురుకులాల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కూడా అందజేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు వాటిని ముద్రించి కళాశాలలకు పంపాలని బోర్డు కార్యదర్శి జలీల్ తెలుగు అకాడమీకి లేఖ రాశారు. ఈక్రమంలో రెండు మూడు రోజుల్లో పుస్తకాలను ముద్రించి సరఫరా చేయనున్నారు. తాజా నిర్ణయం వల్ల దాదాపు మరో లక్షన్నర మంది ప్రయోజనం పొందనున్నారు.
ఇవీ చదవండి :