ఫిబ్రవరి 1నుంచి విద్యార్థులను కళాశాలలకు పంపే తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇంటర్ జేఏసి ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలను తెరిచే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని జేఏసి ప్రతినిధులు కోరారు.
కాలేజీలను శుభ్ర పరిచేందుకు ప్రిన్సిపాళ్ల వద్ద నిధులు లేనందున.. ప్రభుత్వం ఆ బాధ్యతను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని మధుసూదన్ సూచించారు. అలాగే కళాశాలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి.. పదోన్నతులు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: ఏపీలో నేటి నుంచి ఆరు, ఇంటర్ ప్రథమ తరగతులు ప్రారంభం