ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11.30కు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను వెల్లడించనున్నారు. గత నెల 7 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరంలో ఫెయిలైన 1,52,384 మందితో పాటు... ఇంప్రూవ్మెంట్ కోసం 1,48,463 మంది కలిపి మొత్తం 3,00,847 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈనెల 14న ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు.. రేపు మొదటి సంవత్సరం ఫలితాలను ప్రకటించనుంది.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సు ఆహ్వానం