ETV Bharat / city

'దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మర్చిపోలేనివి' - indira gandhi death anniversary news

హైదరాబాద్​ కంటోన్మెంట్​లోని ఇందిరాగాంధీ చౌరాస్తాలో 36వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ విగ్రహానికి కాంగ్రెస్​ నాయకులు పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాయని కొనియాడారు.

'దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మర్చిపోలేనివి'

author img

By

Published : Oct 31, 2020, 3:57 PM IST

ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలు యావత్ దేశం ఎప్పుడూ మర్చిపోలేదని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోన శాంసన్ రాజు తెలిపారు. హైదరాబాద్​ కంటోన్మెంట్​లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో 36వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళఉలర్పించారు.

ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాయని శాంసన్​రాజు వివరించారు. ఆ మహనీయురాలి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జమీల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు యాదగిరి, అడ్వకేట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.